OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయంలో అభిమానులకు ఎప్పటి నుంచో ఓ కల ఉంది. దాన్ని ఇన్నేళ్లకు సుజీత్ తీర్చేశాడు. పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అందులో నో డౌట్. కరెక్ట్ సినిమా పడితే కథ వేరేలా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పవన్ క్రేజ్ ను సరిగ్గా దించిన డైరెక్టర్ లేడు. పవన్ కంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా రూ.100 కోట్లు, రూ.200 కోట్ల కలెక్షన్లను ఈజీగా తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. దీంతో ఎలాగైనా పవన్ సినిమా రూ.200 కోట్ల క్లబ్ లో చేరితే చూడాలనే కోరిక కల్ట్ ఫ్యాన్స్ కు ఎక్కువగా ఉండేది. కానీ ఆ విషయంలో పవన్ కల్యాణ్ కాస్త వెనకబడ్డాడు.
Read Also : Karur-Stampede : ఛీ..ఛీ.. విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై సత్యరాజ్ రియాక్ట్
కానీ ఇన్నేళ్ల తర్వాత ఆ కల తీరిపోయింది. కల్ట్ ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అచ్చం అలాగే చూపించేశాడు సుజీత్. మాస్, ఎలివేషన్లు కలబోసి ఓజీని బ్లడ్ బాత గా మార్చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. మూవీ భారీ హిట్ అయింది. దెబ్బకు నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్ల వసూళ్లు వచ్చేశాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు పవన్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ కలెక్షన్లు. ఇన్ని రోజులు చెప్పుకోవడానికి పెద్ద కలెక్షన్లు లేక ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. కానీ ఇన్నేళ్లకు సుజీత్ రూపంలో వచ్చిన హిట్.. ఫ్యాన్స్ ను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పిస్తోంది. ఈ కలెక్షన్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.
Read Also : Kantara 1 : రిషబ్ శెట్టిపై తెలుగు యువత ఆగ్రహం.. ఇంత చిన్న చూపా..?
When cyclone strikes…
Bow down to the tide…
When #OG comes you run and hide!!252Cr+ Worldwide Gross in 4 days 🔥#BoxOfficeDestructorOG #TheyCallHimOG pic.twitter.com/HGo96vPES4
— DVV Entertainment (@DVVMovies) September 29, 2025