Suhas : ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ఈ నడుమ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ మండాడి. కోలీవుడ్ నటుడు సూరితో కలిసి ఈ సినిమా చేస్తున్నాడు. తమిళ డైరెక్టర్ మతిమారన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సుహాస్ ఊరమాస్ లుక్ లో వైల్డ్ గా కనిపిస్తున్నాడు. గడ్డం, పొడవాటి జుట్టుతో రగ్డ్ లుక్ లో ఉన్నాడు. పైగా టీషర్టు, లుంగీలో కనిపిస్తున్నాడు. ఇది విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నట్టు తెలుస్తోంది. టీషర్టు మీద టీ సునామీ రైడర్స్ అని రాసి ఉంది.
Read Also : IPL 2025 : పాపం ఆ.. ముగ్గురు, కలిసిరాని వీకెండ్..!
ఇదేదో కబడ్డి ఆట నేపథ్యంలో సాగుతున్నట్టు ఉంది. ఇంకో పోస్టర్ లో సూరి, సుహాస్ సముద్రంపై పడవల్లో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ రెండు లుక్స్ ఇప్పుడు చర్చీనీయాంశం అవుతున్నాయి. సుహాస్ ఇలాంటి సీరియస్ లుక్ లో ఇప్పటి వరకు కనిపించలేదు. ఇంత రగ్డ్ లుక్ తో కనిపిస్తుండటంతో ఈ మూవీపై ఒక్కసారిగా హైప్ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి టాలీవుడ్ లో పెద్దగా తెలియదు. కానీ ఈ ఒక్క పోస్టర్ తోనే టాలీవుడ్ అటెన్షన్ మొత్తం తనవైపు మళ్లించుకున్నాడు సుహాస్. మంచి కథలు ఎంచుకునే ఈ హీరో.. ఈ మండాడిలో ఇంకెలా ఉంటాడో అని అంతా వెయిట్ చేస్తున్నారు.
Read Also : Tollywood : నేషనల్ క్రష్.. నేచురల్ స్టార్ ని మూడు సార్లు రిజెక్ట్ చేసిందా..!