IPL 2025 : పాపం ఆ.. ముగ్గురు, కలిసిరాని వీకెండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఐపీఎల్ సీజన్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే 2 జట్లు ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించాయి . మిగిలిన 8 జట్లు భీకరంగా పోటీ పడుతున్నాయి. సీజన్ ఎండ్ కి రావడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. సెంచరీలతో పోటీ పడుతున్నారు. ఈ వీకెండ్ లోనూ అదే పోటీ కనిపించింది. కానీ ముగ్గురు యువ ఆటగాళ్లు సెంచరీకి దగ్గరగా వచ్చి వికెట్ కోల్పోయారు. శనివారం చెన్నై వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో చెన్నైయువ ఆటగాడు ఆయుష్ మాత్రే ఆర్సీబీ బౌలర్లను దంచికొట్టాడు. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. అయితే సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేద్దామనుకున్న ఆయుష్ కు నిరాశే మిగిలింది. లుంగీ ఎన్‌గిడి బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు.
Also Read : Tourist Family Review: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ రివ్యూ.. మనుషులు అంటేనే మంచోళ్లు!
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కేవలం ఒక పరుగు తేడాతో కేకేఆర్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ..6 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు. అయితే పరాగ్ 95 పరుగుల వద్ద వికెట్ కోల్పోయి తన కెరీర్‌లో మొదటి సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక నిన్న ఈవెనింగ్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 236 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడటం మొదలుపెట్టాడు. వచ్చిన బంతిని బౌండరీ తరలిస్తూ పరుగుల వరద పారించాడు. 6 ఫోర్లు , 7 సిక్సర్లతో లక్నో ముందు భారీ లక్ష్యాన్ని విధించాడు. 48 బంతులెదుర్కొన్న ప్రభ్‌సిమ్రాన్ 91 పరుగుల వద్ద నికోలస్ పూరన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇలా యంగ్ గన్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ తమ జట్లకు న్యాయం చేస్తున్నారు.
Also Read : Teacher: జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రభుత్వ టీచర్లు..
- Tags
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!