Sudigali Sudheer Remuneration For Gaalodu Movie: సినీ పరిశ్రమలో ‘హీరోల పారితోషికం’ అనేది ఎప్పుడూ హాట్ టాపిక్కే! మరీ ముఖ్యంగా.. మంచి స్థాయిలో ఉన్న నటులకు ఒక సినిమాకి ఎంత డబ్బు అందుతుంది? అనే చర్చ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ వంతు వచ్చింది. ఒక మెజీషియన్‌గా కెరీర్ ప్రారంభించి, కమెడియన్‌గా తనదైన ముద్ర వేసి, ఇప్పుడు హీరోగా ఎదిగిన సుధీర్.. రీసెంట్‌గా ‘గాలోడు’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ‘సుడిగాలి సుధీర్’తో హీరోగా పరిచయమైన సుధీర్.. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. అయితే.. ‘గాలోడు’ సినిమాని మాత్రం చాలా గ్రాండ్‌గా రూపొందించారు. ఇందులో సుధీర్‌కి ఎలివేషన్స్ కూడా బాగా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమాకి గాను సుధీర్‌కి ఎంత మొత్తం అందిందన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.
ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. ‘గాలోడు’ సినిమాకి సుడిగాలి సుధీర్ రూ. 40 నుంచి రూ. 50 లక్షల వరకు పారితోషికం తీసుకున్నాడని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. ఒకవేళ నిజమే అయితే మాత్రం, నిజంగా ఇది మంచి ఫిగరే! ఒక అప్‌కమింగ్ హీరోగా ఇది భారీ పారితోషికమేనని చెప్పుకోవాలి. వాస్తవానికి.. సుధీర్ హీరోగా చేసిన సినిమాలేవీ పెద్దగా హిట్ అవ్వలేదు. ఏదో ఇలా వచ్చి, అలా వెళ్లిపోయాయి. అయినా, ఈ రేంజ్‌లో సుధీర్‌కి రెమ్యునరేషన్ దక్కడం గొప్ప విషయమేనని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి.. అతనికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా.. అంత పారితోషికం ఇవ్వడంలో తప్పు లేదని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే.. ఇదే క్రేజ్ కొనసాగాలంటే, సుధీర్ మంచి కథల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ట్రెండీ సినిమాలు తీస్తే.. తప్పకుండా మరింత ఉన్న స్థానాలకి సుధీర్ చేరుకుంటాడు.