Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తనదైన స్టైల్లో దూసుకుపోతున్న హీరో సుడిగాలి సుధీర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సుధీర్ నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘సుధీర్ జోకర్’ మూవీ అఫీషియల్ బ్యాంగర్‌ను అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఇంటరాక్షన్ కార్యక్రమంతో పాటు జరిగిన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో చిత్ర యూనిట్ అంతా పాల్గొని సందడి చేసింది. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ను విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సినిమా బ్యాంగర్ లీడ్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. నగరంలో వరుసగా జరిగే వింత దొంగతనాల చుట్టూ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. ఈ చోరీలకు పాల్పడుతుంది ఎవరో కాదు.. ఒక పెద్ద రాయల్ ఫ్యామిలీకి చెందిన సంపన్న యువకుడే అని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అసలు అంత పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టిన హీరో.. దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? అతని అసలు ప్లాన్ ఏంటి? అనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్వాలిటీ విజువల్స్, లియోన్ జేమ్స్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సరికొత్త షాట్ మేకింగ్ ఈ బ్యాంగర్కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ స్క్రీన్ ప్రెజెన్స్, కొత్త లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.
Also Read
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
- The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!