Gaalodu Trailer: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లు టాప్ రేంజ్‌కు చేరుకున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు. అతడు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇప్పుడు బుల్లితెరపైనే కాకుండా వెండితైరపైనా తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీమంకీస్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. తాజాగా సుధీర్ నటిస్తున్న మూవీ గాలోడు. ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం నాడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటోంది. దాదాపు రెండున్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండబోతుందో ముందే మేకర్స్ హింట్ ఇచ్చారు.
Read Also: Hansika Mothwani: ఇదేం పోయేకాలం హన్సిక.. బెస్ట్ ఫ్రెండ్ భర్తను లాగేసుకున్నావా..?
ఈ ట్రైలర్లో ఒకవైపు మాస్ లుక్‌లో ఆకట్టుకుంటూనే మరోవైపు స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను సుధీర్ అలరించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో పలు డైలాగులు జబర్దస్త్ షోను తలపిస్తాయి. అమ్మాయిలు ఫాలో చేస్తే పడతారు.. లేదా ఫాలోయింగ్ ఉన్నవాళ్లకు పడతారు అంటూ షకలక శంకర్ చెప్పే డైలాగ్ వాస్తవానికి దగ్గరగా ఉంది. అటు తమ్ముడు ఏ ఊరు అని సప్తగిరి అడిగితే సుధీర్ పల్లెటూరు అని చెప్పే డైలాగ్‌తో పాటు వయసు తక్కువ `షో`లు ఎక్కువ, నువ్వు శనివారం పుట్టావా? శనిలా తగులుకున్నావ్, రామాయణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్కడ అందరు మాయ లేడీలే వంటి డైలాగ్స్ కూడా పేలాయి. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించాడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ విజువల్స్, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.