Hansika Mothwani: శుభమా అని హన్సిక పెళ్లి చేసుకోబోతుంటే పోయేకాలం అని అంటారేంటి అనుకుంటున్నారా..? అంటే మ్యాటర్ అలాంటిది. దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కోలీవుడ్ లో అడుగుపెట్టి శింబు తో ప్రేమాయణం నడిపి అక్కడ నుంచి బాలీవుడ్ కు చెక్కేసింది. ఇక బొద్దుగా ఉన్న ఈ భామ సన్నజాజి తీగలా మారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సై అంటూ పలు సినిమాల్లో నటిస్తూ వస్తుంది. కాగా, కెరీర్ పీక్స్ స్టేజిలో నడుస్తుంది అనే సమయంలో పెళ్ళికి ఓకె చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహెల్ ఖతిరియా తో అమ్మడు పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం విదితమే. ఇక ఎప్పుడైతే భర్త గురించి అధికారికంగా అభిమానులకు చెప్పిందో వారందరు అతడి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. నెటిజన్లు తలుచుకుంటే తెలియనిది ఏదైనా ఉంటుందా.. అలానే సోహెల్ గురించి కూడా కొన్ని విషయాలు బయటపడ్డాయి.
సోహెల్ ఎవరో కాదు.. హన్సిక బెస్ట్ ఫ్రెండ్ రింకీ భర్త అంట.. దగ్గరుండి ఈ జంటకు పెళ్లి చేసింది కూడా హన్సికనే అంట. అయితే ఈ జంట మధ్య కొన్ని విబేధాలు రావడంతో సోహెల్, రింకీకి విడాకులు ఇచ్చేసి..హన్సికకు ప్రపోజ్ చేశాడని సమాచారం. హన్సిక సైతం ఓకే చెప్పడంతో వీరి పెళ్లి ఖాయమైంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఖంగుతింటున్నారు. ఇదేం పోయేకాలం హన్సిక.. రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది..? అందులోనూ బెస్ట్ ఫ్రెండ్ భర్తను కోరుకున్నావా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం వారిద్దరూ విడిపోయాకే కదా పెళ్లి చేసుకుంటున్నారు. అందులో తప్పేముంది అని సమర్థిస్తున్నారు.