నైట్రో స్టార్ సుధీర్ బాబు హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సినిమా సినిమాకి ఒక యాక్టర్ గా ఎవాల్వ్ అవుతూనే ఉన్న సుధీర్ బాబు, ప్రస్తుతం మామా మశ్చీంద్ర సినిమా చేస్తున్నాడు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో సుధీర్ బాబు కనిపించనున్న ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కథలో విషయం ఉంటే సుధీర్ బాబు మామ మశ్చీంద్ర సినిమాతో మంచి హిట్ కొట్టే అవకాశం ఉంది. అయితే అవకాశం కాదు షూర్ షాట్ హిట్ కొడతాను, రాసి పెట్టుకోండి అంటూ తన బర్త్ డే రోజున చిత్తూరు యాసలో హెచ్చరికలు జారి చేశాడు సుధీర్ బాబు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న ‘సెహేరి’ సినిమాని డైరెక్ట్ చేసిన జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు ఒక సినిమా చేస్తున్నాడు. సుధీర్ బాబు ‘సుబ్రహ్మణ్యం’ అనే పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘హరోం హర’ అనే టైటిల్ తో ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్చువల్ వీడియో గతేడాది అక్టోబర్ నెలలో బయటకి వచ్చింది.
చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో జరిగిన పీరియాడిక్ కథతో హరోం హర సినిమా తెరకెక్కుతుంది అనే విషయాన్ని కాన్సెప్ట్ వీడియోతోనే చెప్పేసిన మేకర్స్, లేటెస్ట్ గా సుధీర్ బాబు బర్త్ డే రోజున ఒక చిన్న గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. “హెచ్చరిక వర్షపాతనికే ఇచ్చిరి ఇంగ రక్త పాతానికి నేను ఇవ్వాల్నా ఏమీ?” అంటూ సుధీర్ బాబు ఈ గ్లిమ్ప్స్ ని షేర్ చేశాడు. “రేడియోలో వాతవరణ వార్తలు వినిపిస్తున్న సమయంలో, ఒక జిప్సీ వచ్చి చిన్న హోటల్ ముందు ఆగింది. జిప్సీలో నుంచి కొంతమంది కత్తులు గన్నులు పట్టుకోని కిందకి దిగి, హోటల్ ఎంట్రెన్స్ ముందు వచ్చి ఆగారు(అలా వచ్చిన వారిలో ఒకతను వేసుకున్న షూ చూస్తుంటే అతను పోలిస్ డిపార్ట్మెంట్/ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెందిన వాడిలా ఉన్నాడు). కత్తులు, గన్నులతో మనుషులు హోటల్ ఎంట్రెన్స్ ముందు నిల్చుంటే సుధీర్ బాబు ఒక టేబుల్ ముందు కూర్చోని ఉన్నాడు. ఆ టేబుల్ పైన టీ అండ్ గన్ ఉన్నాయి. ఈ గన్ను అక్కడా ఇక్కడ తిరిగి నా దగ్గరికి వచ్చింది అనే డైలాగ్ చెప్తూ… సుధీర్ బాబు గన్నుని చేతిలోకి తీసుకున్నాడు”. ఇక్కడితో టైటిల్ ని రివీల్ చేసి హరోం హర గ్లిమ్ప్స్ ని ఎండ్ చేశారు. గ్లిమ్ప్స్ చూడడానికి, వినడానికి చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఇదే సినిమాలో కూడా ఉంటే సుధీర్ బాబు ఈ డిసెంబర్ 22కి సాలిడ్ హిట్ కొట్టడం గ్యారెంటీ.
హెచ్చరిక వర్షపాతనికే ఇచ్చిరి ఇంగ రక్తపాతనికి నేను ఇవ్వాల్నా ఏమి?
Truly, a new version of mine in store for you😎
In theaters from Dec 22, 2023!!
▶️https://t.co/sdr5xdYAzu#HaromHara
@gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic #AravindViswanathan #RavitejaGirijala… pic.twitter.com/2lsX1fo1dd— Sudheer Babu (@isudheerbabu) May 10, 2023