Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినా విషయం విదితమే. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 11 న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త సినీ, రాజకీయ రంగాలను విషాదంలో నింపేసింది. ఇక ఇప్పటికి ఆయన మృతి చెందారంటే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలు అన్ని ప్రభాస్ దగ్గర ఉండి జరిపించాడు. షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి మరీ కుటుంబానికి తోడుగా ఉంటున్నాడు ప్రభాస్. ఇక మరోపక్క మొగల్తూరులో కృష్ణంరాజు సంస్కరణ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 29 కృష్ణంరాజు సొంత ఊరు మొగల్తూరులో ఆయన సంస్కరణ సభను ఘనంగా జరుపుతున్నారు. దాదాపు 70 వేలమందికి ప్రభాస్ భోజనాలు తయారుచేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణంరాజును మర్చిపోలేని కుటుంబ సభ్యులు ఆయన మైనపు విగ్రహాన్ని తయారుచేయిస్తున్నట్లు తెలుస్తోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్త పేట మండలంలోని ప్రముఖ విగ్రహాల శిల్పి వడయార్ రెబల్ స్టార్ విగ్రహాన్ని చెక్కుతున్నట్లు సమాచారం. ఇటీవల ఈ మైనపు విగ్రహాలహవా బాగా నడుస్తోంది. చనిపోయినవారి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవడానికి వారి విగ్రహాలను తయారుచేయించుకుంటున్నారు కుటుంబ సభ్యులు. బతికి ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో.. విగ్రహాల్లో కూడా ఆ మనుషులు అలానే కనిపించడం ఈ విగ్రహాల ప్రత్యేకత. ఇక కృష్ణంరాజు విగ్రామ్ చూస్తుంటే కూడా ఆయన మన మధ్యనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని నవ్వుతూ కృష్ణంరాజు కూర్చుంటే ఎలా ఉంటారో అచ్చుగుద్దినట్లు ఈ బొమ్మలో కూడా ఆయన అలాగే కనిపించారు. సడెన్ గా చూస్తే ఆయన బతికే ఉన్నారా..? అన్న అనుమానం కూడా రాకపోదు. ప్రస్తుతం ఈ విగ్రహం ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని సంస్కరణ సభ రోజున ఆవిష్కరించనున్నారని, అనంతరం కృష్ణంరాజు ఇంటి వద్ద పెట్టనున్నట్లు సమాచారం.