కన్నడ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడి నుంచి పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ‘రష్మిక మందన్న’. నేషనల్ క్రష్ గా కాంప్లిమెంట్స్ అందుకునే రష్మిక ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యేవే. ఈ సినిమాల ప్రమోషన్స్ కోసం నార్త్ టు సౌత్ తెగ తిరిగేస్తున్న రష్మిక, తన బాలీవుడ్ మూవీ ‘మిషన్ మజ్ను’ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి ‘రబ్బా జాండా’ అనే సాంగ్ డిసెంబర్ 25న రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన రష్మిక, సౌత్ మరియు నార్త్ ఇండస్ట్రీల మధ్య మ్యూజిక్ లో ఉండే వ్యత్యాసం గురించి కామెంట్స్ చేసింది. సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చే సాంగ్స్ లో ఎక్కువగా మాస్ మసాలా ఎలిమెంట్స్ ఉంటాయి, నార్త్ ఇండస్ట్రీలో రొమాంటిక్ సాంగ్స్ ఎక్కువగా వస్తుంటాయని రష్మిక మాట్లాడింది.
Read Also: Adivi Sesh: ఆమెతో అడివి శేష్ ఎఫైర్.. మరోసారి బట్టబయలు..?
మిగిలిన హీరోయిన్ ల విషయం కాసేపు పక్కన పెడితే రష్మిక కెరీర్ వరకూ చూస్తే… ఆమె కెరీర్ లో మాస్ సాంగ్స్ కన్నా ఎక్కువగా మెలోడీ, రొమాంటిక్ లవ్ సాంగ్స్ ఏ ఎక్కువగా ఉన్నాయి. ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, ఆడాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలో మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఉన్నాయి. రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు, పుష్ప, వారిసు లాంటి సినిమాల్లోనే మాస్ సాంగ్స్ ఉన్నాయి. రష్మిక మాటలని విన్న సౌత్ ఫిల్మ్ ఆడియన్స్… కమర్షియల్ సినిమాల్లో మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చెయ్యడానికి, సినిమాలో ఊపు తీసుకోని రావడానికి మాస్ మసాలా సాంగ్స్ ని ప్లేస్ చేస్తారు. లవ్ స్టొరీ మరియు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో రొమాంటిక్, ఫీల్ గుడ్ సాంగ్స్ ఎక్కువగా ఉంటాయి. రూపొందే సినిమాలని బట్టి సాంగ్స్ ఉంటాయి కానీ ఇండస్ట్రీని బట్టి సాంగ్స్ ఉండవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Michael: విజయ్ సేతుపతి టచ్ అయినా సందీప్ కి కలసి వస్తుందా!?