SSMB 29: ఈ ఆఫ్రికన్ అడ్వెంచర్ సినిమాలో హాలీవుడ్ స్టార్-విజయేంద్ర ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫీషియల్ గా లాంచ్ చేయడం ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఎదో ఒక కొత్త వార్త SSMB 29 గురించి వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు జోరుగా వినిపిస్తోంది. ఇక సెకెండ్ లీడ్‌లో హాలీవుడ్ హీరోయిన్ జెన్నా ఒర్టెగా కనిపించనుందనే టాక్ నడుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “ఇది ఆఫ్రికన్ అడ్వెంచర్ డ్రామా… హాలీవుడ్ యాక్టర్ నటించే అవకాశం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీలతో టై అప్ అయ్యి రాజమౌళి హాలీవుడ్ స్టార్స్ ని ఇండియన్ సినిమాపై కనిపించేలా చేయనున్నాడు అనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది.
ఇందులో భాగంగా థార్ సినిమా హీరో క్రిస్ హేమ్స్ వర్త్ పేరు బలంగా వినిపించింది. ఈ యాక్టర్ దాదాపు ఫైనల్ అయ్యాడని ఇండియన్ మీడియా కూడా కథనాలు రాసింది. ఈ విషయంలో ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. ఇలాంటి సమయంలో ఒక హాలీవుడ్ యాక్టర్ SSMB 29లో నటించే అవకాశం ఉందని విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో అందరి చూపు మళ్లీ క్రిష్ హేమ్స్ వర్త్ పై పడింది. నిజానికి ‘ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాట్టింగ్ కథని మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తాన”ని రాజమౌళి ఇప్పటికే చెప్పి SSMB 29 ప్రాజెక్ట్ పై ప్రపంచ సినీ అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అవతార్, అవెంజర్స్, టెర్మినేటర్, ఇండియానా జోన్స్ తరహాలో ఫ్రాంచైజ్ సినిమాలు ఇండియాలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.
Also Read
మన దగ్గర కూడా ఏక్ థా టైగర్, సింగం, దృశ్యం లాంటి ఫ్రాంచైజ్ లు ఉన్నాయి కానీ లార్జ్ స్కేల్ లో రూపొందిన ఫ్రాంచైజ్ లు అయితే లేవు. అడ్వెంచర్ సినిమా చేసే సమయంలో, ఎన్నో ఇంటరెస్టింగ్ పాయింట్స్ పుడుతూ ఉంటాయి, కొత్త కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి, సినిమా సినిమాకి ఛాలెంజులు పెరుగుతూ ఉంటాయి, స్పాన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక యూనివర్స్ లోకి ఏ క్యారెక్టర్ ఎక్కడి నుంచైనా రావొచ్చు, దాని లీడ్ సినిమాని ఎటైనా టర్న్ చెయ్యొచ్చు. సో రాజమౌళి, మహేశ్ లు ఫ్రాంచైజ్ ని చేస్తున్నారు అనేది నిజమైతే… ఈ వరల్డ్ లో చాలా మంది హీరోలని, హీరోయిన్ లని, ఇంటరెస్టింగ్ సెటప్ లో రూపొందించిన సీన్స్ ని చూసే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
-
CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..