సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అనౌన్స్ అయిన మూడో సినిమా ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉండగా కృష్ణ గారు చనిపోవడంతో, SSMB28 షూటింగ్ కి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. డిసెంబర్ నెలలో SSMB 28 సెకండ్ షెడ్యూల్ మొదలవ్వనుంది. ఈ మూవీతో ‘ఖలేజా’ బాకీ తీర్చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని చాలా బలంగా రాసుకున్నాడట. తమన్ మ్యూజిక్ అందిస్తున్న SSMB 28 మ్యూజిక్ సిట్టింగ్స్ ముంబై మొదలయ్యాయి. త్రివిక్రమ్, తమన్ లు ముంబైలో మహేశ్ బాబుని కలిసి సాంగ్స్ గురించి, స్టొరీ గురించి డిస్కస్ చేశారు. ఈ సంధర్భంగా మహేశ్, త్రివిక్రమ్, తమన్ లు డిన్నర్ చేస్తున్న ఫోటోలని నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నమ్రత పోస్ట్ చేసిన ఫోటోలు చూడగానే మహేశ్ ఫాన్స్ కంగారు పడుతున్నారు. త్రివిక్రమ్, తమన్ లు అంటే SSMB28 పనుల్లో మహేశ్ బాబుని కలిసి ఉంటారు? ఈ మెహర్ రమేష్ ఎందుకు కలిశాడు అంటూ కన్ఫ్యూస్ అవుతున్నారు. కొంపదీసి మహేశ్ బాబు, మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడా అంటూ భయపడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మెహర్ రమేష్ తో మహేశ్ బాబు సినిమా అనే టాపిక్ ఇప్పటికైతే లైన్ లో లేదు. అయితే మెహర్ రమేష్ మాత్రం మహేశ్ బాబుకి కష్టం వచ్చిన ప్రతిసారీ అతని పక్కన ఉంటాడు. కృష్ణ చనిపోయిన సమయంలో కూడా మెహర్ రమేష్ మహేశ్ బాబుతోనే ఉన్నాడు. ఆ రిలేషన్ కారణంగానే త్రివిక్రమ్, తమన్ లు వచ్చినప్పుడు మెహర్ ని కలిసి ఉంటారు.