‘బాహుబలి’, ‘బాహుబలి 2’ వంటి సంచలన చిత్రాలతో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (జక్కన్న) దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ అపారమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా సిరీస్‌లో మూడో భాగం వచ్చే అవకాశం ఉందంటూ గతంలో ప్రచారం జరిగినా, రాజమౌళి దాన్ని ఎప్పుడూ ఖండించకపోవడం అభిమానుల్లో ఆశను సజీవంగా ఉంచింది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్-ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రభాస్, ఇతర నటీనటులు కూడా వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో, లైవ్-యాక్షన్ ఫార్మాట్‌లో ‘బాహుబలి 3’ సాధ్యం కాదేమోనన్న చర్చ జరిగింది.
Also Read:OG Sequel: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
అయితే, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం… రాజమౌళి ‘బాహుబలి 3’ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈసారి పూర్తిగా యానిమేటెడ్ ఫార్మాట్లో మూడో భాగాన్ని తెరకెక్కించాలని యోచిస్తున్నారట. ఈ యానిమేషన్ సినిమాకు సంబంధించిన కథ, కథనం (స్క్రిప్ట్) పనులను రాజమౌళి సిద్ధం చేసి, పర్యవేక్షించనున్నారని సమాచారం. ఇటీవల విడుదలైన ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేటెడ్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించి, సుమారు 350 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. యానిమేషన్ చిత్రాలకు సైతం భారీ ఆదరణ దక్కుతుందని ఈ సినిమా నిరూపించింది.6
Also Read:Star Brothers : టాలీవుడ్ మార్కెట్‌పై కోలీవుడ్ బ్రదర్స్ స్ట్రాంగ్ ఫోకస్
‘బాహుబలి’కి ఉన్న అసాధారణ క్రేజ్, అలాగే రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ పట్ల ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం దృష్ట్యా, యానిమేటెడ్ ఫార్మాట్‌లో ‘బాహుబలి 3’ కనీసం మరో వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. జక్కన్న తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం బాహుబలి అభిమానులకు నిజంగా శుభవార్తే. యానిమేటెడ్ రూపంలోనైనా మహిష్మతి సామ్రాజ్యాన్ని తిరిగి తెరపై చూసే అవకాశం దక్కడం పట్ల ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.