‘బాహుబలి’, ‘బాహుబలి 2’ వంటి సంచలన చిత్రాలతో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (జక్కన్న) దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ అపారమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా సిరీస్‌లో మూడో భాగం వచ్చే అవకాశం ఉందంటూ గతంలో ప్రచారం జరిగినా, రాజమౌళి దాన్ని ఎప్పుడూ ఖండించకపోవడం అభిమానుల్లో ఆశను సజీవంగా ఉంచింది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్-ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రభాస్, ఇతర నటీనటులు కూడా వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు.…