లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ శృతి హాసన్… తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేసింది కానీ శృతి హాసన్ కి ఆశించిన స్థాయి స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా శృతి హాసన్ కెరీర్ లో జోష్ రాలేదు. ఒకానొక సమయంలో పర్సనల్ లైఫ్ ఇష్యూస్ లో ఇరుక్కుపోయిన శృతి హాసన్ సినిమాలని కూడా తగ్గించేసింది. కమల్ కూతురి కెరీర్ అయిపొయింది, ఇక సినిమాలు చేయడం కష్టమే అనుకున్నారు. శృతి కూడా తాను బ్రేక్ అప్ అయ్యాక తాగుడుకి బానిసని అయ్యాను అంటూ ఓపెన్ గానే చెప్పింది.
సినిమాలు తగ్గడం, అప్పటికే చేసిన సినిమాల్లో పెద్దగా హిట్స్ లేకపోవడంతో శృతి హాసన్ టైం అయిపోయిందని అందరూ డిసైడ్ అయిపోయారు. అయితే శృతి హాసన్ ఎవరూ ఊహించని విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో శృతి హాసన్ స్టార్ హీరోలతో భారి సినిమాలు చేస్తోంది. మాస్ మహారాజ రవితేజతో ‘క్రాక్’ సినిమా చేసిన శృతి హాసన్… ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, మాస్ మూలవిరాట్ చిరంజీవిలతో సినిమాలు చేస్తోంది. చిరు, బాలయ్యలు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతుంటే శృతి హాసన్ మాత్రం ఆ రెండు సినిమాల్లో నేనే హీరోయిన్, రెండు సినిమాలని చూసేయండి అంటోంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో పాటు శృతి హాసన్ నటిస్తున్న మరో భారి ప్రాజెక్ట్ ‘సలార్’. బాహుబలి ఆఫ్ మాసేస్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ప్రాజెక్ట్. ఈ సినిమా హిట్ అయితే శృతి హాసన్ కెరీర్ కి బిగ్గెస్ట్ టర్న్ వచ్చినట్లే. మరి 2023లో మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకి రానున్న శృతి హాసన్, స్టార్ స్టేటస్ అందుకుంటుందేమో చూడాలి.