ఏ ఇండస్ట్రీలో అడుగుపెడితే అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోతుంది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. తెలుగమ్మాయి అయినప్పటికీ కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసి అటు నుండి టాలీవుడ్ లోకి బ్యాగ్ సర్దేసింది. క్రేజీ ప్రాజెక్టులు ఒడిసి పట్టి యంగ్ భామలకు కాంపీటీటర్ అయ్యింది. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాల్లో ఫస్ట్ ఛాయిస్ కావడంతో కో యాక్ట్రెస్ లు కుళ్లుకున్న దాఖలాలు ఉన్నాయి.
ప్రెజెంట్ తెలుగులో అమ్మడి క్రేజ్ ఎవరెస్ట్ కు చేరింది. ఆమె చేతిలో రాబిన్ హుడ్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తుంది. ఇవే కాదు తమిళంలో సుధాకొంగర దర్శకత్వంలో వస్తోన్న పరాశక్తిలో నటిస్తోంది. రీసెంట్లీ మేడమ్ లుక్ రివీల్ చేసింది యూనిట్. ఇదే కాదు ఫుష్ప 2తో బీటౌన్ లో క్రేజ్ పెరగడంతో బాలీవుడ్ పై ఫోకస్ చేస్తోన్నట్లు కనిపిస్తోంది శ్రీలీల. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న మిట్టిలో కమిటయ్యింది. ఈ మధ్య కాలంలో సైఫ్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తో ఫోటోలకు ఫోజులిస్తూ అక్కడ మీడియాకు అటెన్షన్ ఇచ్చింది. అతడితో సినిమా సెట్ అయ్యినట్లు టాక్ వచ్చింది. అలాగే భూల్ భూలయ్యా 3తో హిట్టు అందుకున్న క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేస్తుంది. అనురాగ్ బసు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ ప్రకటించనప్పటికీ గ్లిమ్స్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారకంగా ప్రకటించారు. శ్రీలీల డెబ్యూ చేస్తున్న ఈ సినిమాను టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.