యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలానే అనిల్ రావిపూడి విడుదల చేసిన టైటిల్ సాంగ్ కూ మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఇదే నెల 19న విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఆ మేరకు ఓ ట్వీట్ చేశారు. నిర్మాతలు ఆగస్ట్ 19ని మూవీ రిలీజ్ డేట్ గా లాక్ చేశారని, అయితే క్రేజీ అంకుల్సే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అందులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శ్రేయాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ”ఈ ప్రాజెక్ట్ 2020 దసరాకు ప్రారంభమైంది. 2021 జనవరిలో పూర్తయింది. ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో వాయిదా వేశాం. ఆ తర్వాత మేలో విడుదల చేద్దాం అనుకున్నాం. కరోనా వచ్చింది. ఇప్పుడు ‘క్రేజీ అంకుల్స్’ను ఇదే నెల 19న విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. మా మరో మూవీ ‘గోల్డ్‌మ్యాన్’ ను ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని అన్నారు.
The Producers locks the Release Date of CRAZY UNCLES ON AUGUST 19TH.
— Shreyas Sriniwaas (@shreyasmedia) August 8, 2021
But the CRAZY UNCLES ARE YET TO DECIDE
CRAZY UPDATE COMING SOON@MukhiSree @ManoSinger_Offl @Rajaraveendar #Bharani #ESathiBabu @kuncheraghu #kiranktalasila @DirectorSriwass #Sriwass2Creatives @thegcgofficial pic.twitter.com/4tvoLrsZtD