“ఈ అమ్మాయి తో డాన్స్ ఎయ్యడం వామ్మో… అదేం డాన్స్… హీరోలు అందరికి తాట ఊడిపోద్ది…” ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు గడ్డపైనే గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పిన మాటలు. మహేష్ మాటల్లో నిజముంది… ఈ జనరేషన్ లో శ్రీలీల రేంజులో డాన్స్ వేసే యంగ్ హీరోయిన్ ఇంకొకరు లేరు. ఇరగదీసే స్టెప్పులని కూడా ఈజ్ తో వేయడం శ్రీలీల స్టైల్. ఆమె ఒక సినిమాలో నటిస్తుంది అంటే ఆడియన్స్ ఒక సాలిడ్ డాన్స్ నంబర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే శ్రీలీల డాన్స్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ధమాకా సినిమాలో శ్రీలీల మ్యాజిక్ చేసి చూపించింది.
Read Also: Chiru: బాస్ మాస్ పూనకాలు తెప్పించి ఏడాది అయ్యింది…
నితిన్, రామ్ పోతినేని లాంటి హీరోలతో కూడా శ్రీలీల దుమ్ము లేచిపోయే రేంజ్ డాన్స్ వేసింది. అందుకే మహేష్ బాబు చెప్పిన మాటలో నిజముంది. అయితే శ్రీలీలకి ఇంకా అసలైన ముగ్గురు మొనగాళ్లు తగలలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… ఇండియాలోనే బెస్ట్ డాన్సర్స్ లిస్ట్ తీస్తే అందులో తప్పకుండా టాప్ 5లో ఈ ముగ్గురే ఉంటారు. ఎలాంటి డాన్స్ మూవ్ ని అయినా ఈజ్ తో చేయడం, స్వాగ-గ్రేస్-ఎక్స్ప్రెషన్స్ ని మైంటైన్ చేయడం చరణ్-అల్లు అర్జున్-ఎన్టీఆర్ కి చాలా బాగా తెలుసు. ఈ ముగ్గురు హీరోలు తగిలితే శ్రీలీలలోని డాన్సర్ కి అసలైన కాంపిటీషన్ పడినట్లు అవుతుంది. వీళ్లని మ్యాచ్ చేయడానికి శ్రీలీల చాలా కష్టాలే పడాల్సి వస్తుంది.