“ఈ అమ్మాయి తో డాన్స్ ఎయ్యడం వామ్మో… అదేం డాన్స్… హీరోలు అందరికి తాట ఊడిపోద్ది…” ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు గడ్డపైనే గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పిన మాటలు. మహేష్ మాటల్లో నిజముంది… ఈ జనరేషన్ లో శ్రీలీల రేంజులో డాన్స్ వేసే యంగ్ హీరోయిన్ ఇంకొకరు లేరు. ఇరగదీసే స్టెప్పులని కూడా ఈజ్ తో వేయడం శ్రీలీల స్టైల్. ఆమె ఒక సినిమాలో నటిస్తుంది…