Sree Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా పెద్ద సినిమా చేస్తోంది. అమ్మడి ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపైనే ఉన్నాయి. అది గనుక హిట్ అయితే తన కెరీర్ కు మళ్లీ ఊపు వస్తోందని భావిస్తుంది ఈ అమ్మడు. అలాగే దీంతోపాటు రవితేజ సరసన నటిస్తున్న మాస్ జాతర సినిమా కూడా ఈమె భవిష్యత్తును నిర్ణయించబోతోంది..
Read Also : Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సెంథిల్
ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే అప్పుడప్పుడు కొన్ని షోలకు, ఇంటర్వ్యూలకు వస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అందలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల.. తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలను బయటపెట్టింది. తనకు కాబోయే వాడు అందంగా లేకపోయినా పర్వాలేదు గానీ.. తనను ఎక్కువగా అర్థం చేసుకోవాలని తెలిపింది. తన కెరియర్ కు అతను సపోర్ట్ చేయాలని.. ఎక్కువ కేరింగ్ గా చూసుకోవాలని, తనతో జోవియల్ గా ఉండాలని.. అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీగా ఉండాలని తెలిపింది. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి కలిసినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోవడంపై కూడా స్పందించింది. కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా నటనకు స్కోప్ ఉండే పాత్రల కోసం వెయిట్ చేస్తున్నానని.. అందుకే ఏది పడితే అది చేయకుండా గ్యాప్ ఇచ్చినట్టు వివరించింది.
Read Also : Napoleon Returns : ‘నెపోలియన్’ రిటర్న్స్’ గ్లింప్స్ రిలీజ్..