సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. అతడు, ఖలేజా సినిమాలతో పెండింగ్ ఉన్న హిట్ ని సాలిడ్ గా అందుకోవడానికి మహేశ్-త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున రిలీజ్ చేయనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ కి ప్రస్తుతం బ్రేక్ పడింది. ప్రతి సమ్మర్ కి ఫ్యామిలీతో ఫ్యామిలీ ట్రిప్ వెళ్లే మహేశ్ బాబు, ఈసారి కూడా అలానే ఫారిన్ ట్రిప్ కి వెళ్లాడు. ఈ కారణంగా SSMB 28 షూటింగ్ షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. త్వరలోనే మహేశ్ తిరిగి రానున్నాడు, వచ్చిన వెంటనే ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్‌లో జరిగిన మార్పుల వల్ల మిగతా స్టార్స్ డేట్స్ అడ్జెస్ట్ అవడం కష్టంగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్టార్టింగ్‌లో పూజ హెగ్డే కూడా డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది అనే మాట వినిపించింది.
ఇప్పుడు పూజా రెడీగా ఉన్నా.. మరో హీరోయిన్, మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీలకి మాత్రం డేట్స్ కష్టంగా మారాయట. ఇప్పటికే శ్రీలీల అరడజనుకు పైగా సినిమాలను లైన్లో పెట్టేసింది. బ్యాక్ టు బ్యాక్ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉంది. దాంతో ఎస్ఎస్ఎంబీ 28కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట. మహేష్ బాబు కాంబినేషన్స్ సీన్స్ ఉంటే శ్రీలీల ఫస్ట్ ప్రయారిటీ ఎస్ఎస్ఎంబీ 28కే ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ బిల్డ్ చేసుకునే స్టేజ్ లో ఉన్న శ్రీలీల లాంటి యంగ్ హీరోయిన్, SSMB 28 లాంటి భారి ప్రాజెక్ట్ కి డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోవడం అనేది ఉత్తి మాటనే అయి ఉండొచ్చు. SSMB 28పై రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు, ఇప్పటికే చాలా రకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆ రూమర్స్ ని ప్రొడ్యూసర్ నాగ వంశీ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నాడు, ఎన్ని క్లియర్ చేసినా ఇలాంటి రూమర్స్ బయటకి వస్తూనే ఉన్నాయి. వీటికి ఎండ్ కార్డ్ పడాలి అంటే మే 31న ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని అందరినీ ఖుషి చేసే రేంజులో రిలీజ్ చెయ్యాల్సిందే.