Sree Leela : శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్ళీ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. చాలా కాలం గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ఈ బ్యూటీ పేరు మార్మోగిపోతుంది. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర సినిమాలో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా శ్రీ లీల వరుస ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ మూవీ గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది. నేను రవితేజతో ఇప్పటికే ఓ సినిమా చేశాను. ఇది నాకు రెండో సినిమా. ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుంది.
Read Also : Dhanya Balakrishna : అలాంటి సీన్లు చేయకపోతే కెరీర్ ఉండదు.. హీరోయిన్ కామెంట్స్
ఇక నేను పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మూవీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఫ్రెండ్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో ఆ సినిమా అలాగే ఉంటుంది. అందరికీ కావాల్సిన బోలెడంత ఎంటర్ టైన్మెంట్ అందులోనే ఉంటుంది. గతంలో ఎన్నడు చూడని విధంగా ఆ సినిమా ఉంటుంది అంటూ హైట్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది చూసిన ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. మరి ఈ రెండు సినిమాలు శ్రీ లీల కెరీర్ ఏ స్థాయిలో నిలబెడతాయో చూడాలి.
Read Also : Ramyakrishna : ఐరన్ లెగ్ అన్నారు.. రమ్యకృష్ణ ఎమోషనల్