సమరం మొదలెట్టబోతున్న అర్జునుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుదిమెరుగుల్లో ‘అర్జున ఫల్గుణ’!
శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అర్జున ఫల్గుణ’. థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘జోహార్’ను తెరకెక్కించిన తేజ మర్ని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవితో ‘ఆచార్య’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం నిర్మిస్తున్న మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘అర్జున ఫల్గుణ’ రూపుదిద్దుకుంటోంది. ఒకవైపు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్, మరోవైపు యువ ప్రతిభావంతులతో కంటెంట్ రిచ్ ఎంటర్‌టైనర్స్ నిర్మిస్తూ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళుతోందీ సంస్థ. టైటిల్ గురించి దర్శకుడు చెబుతూ, మహాభారతంలో అర్జునునికి ఫల్గుణ అనే మరో పేరు కూడా ఉందని మనకు తెలుసు. ఫాల్గుణ మాసంలో జన్మించినందున ఆయనను ఆ పేరుతోనూ పిలుస్తుంటారు. ఇందులో ఆ పేరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది” అని అన్నారు. ఎన్.ఎం. పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను దర్శకుడు తేజ మర్ని స్వయంగా సమకూరుస్తున్నారు. సుధీర్ వర్మ పి. డైలాగ్స్ రాస్తున్నారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ మ్యూజిక్ అందిస్తుండగా, జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయిందని, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని చిత్రబృందం తెలిపింది.
Also Read
తాజావార్తలు
-
China Robot: చైనా రోబోలు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!