పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే టాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది శ్రీలీలా. ఇటివలే రవితేజ నటించిన ధమాకా సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా యాక్ట్ చేసి తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. జనరల్ గా రవితేజ సినిమాలో రవితేజ తప్ప ఇంకొకరు కనిపించరు అలాంటిది శ్రీలీల తన గ్లామర్ అండ్ డాన్స్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసింది. ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడానికి శ్రీలీలా కూడా ఒక కారణమే అనిపించే రేంజులో పేరు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫర్స్ వర్షంలా కురుస్తున్నాయి. ఇప్పటికే మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీలా తాజాగా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అనీల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK 108లో బాలయ్గాయ కూతురి నటిస్తున్న శ్రీలీలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కడానికి రెడీ అవుతున్న ఈ క్రేజీ కాంబినేషన్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అంటే చిన్న విషయం కాదు.
ఆ తర్వాత సీతారా ఎంటర్టైన్మెంట్-విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్నునూరి కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమాలో కూడా శ్రీలీలని హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నారట. అదే జరిగితే శ్రీలీల యంగ్ హీరో పక్కన నటించబోయే మొదటి ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండదే అవుతుంది. రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ప్రాజెక్ట్ లో కూడా శ్రీలీలనే హీరోయిన్. ఇవి మాత్రమే కాకుండా నితిన్ 32వ సినిమాలో, పంజా వైష్ణవ్ తేజ్ 4వ సినిమాలో, నవీన్ పోలిశెట్టి కొత్త సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది. వీటిలో దాదాపు అన్ని సినిమాలు 2024 ఎండ్ అయ్యే లోపు రిలీజ్ అయ్యేవే. SSMB 28తో ఈ ఆగస్ట్ నుంచి శ్రీలీలా మ్యాజిక్ స్టార్ట్ అయితే 2024 ఎండ్ వరకూ ప్రతి రెండు నెలలకి ఒకసారి శ్రీలీలా నటించిన సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. దీంతో వీటిలో ఏ రెండు మూడు సినిమాలు సూపర్ హిట్ అయినా శ్రీలీలా సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం ఖాయం.