Spirit : హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఘనంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, తృప్తి దిమ్రి, సినిమా టీమ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరు చీఫ్ గెస్ట్ గా వచ్చి స్క్రిప్టును అందజేశారు. లాంచ్ తరువాత డైరెక్షన్ టీమ్‌తో కలిసి చిరంజీవి ఫోటో దిగారు. ఆ ఫోటోలో కనిపించిన ఇద్దరు యువకులు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నారు.
Read Also : Akhanda 2 : యూపీ సీఎం యోగిని కలిసిన అఖండ2 టీమ్
వారెవరో కాదు ఒకరు హీరో రవితేజ కుమారుడు మహాధన్… మరొకరు దర్శకుడు త్రివిక్రమ్ కుమారుడు రిషి. వీరిద్దరూ స్పిరిట్ డైరెక్షన్ లో టీమ్ లో పనిచేస్తున్నట్టు ఎప్పటి నుంచో రూమర్లు ఉన్నాయి. ఇప్పుడు నిజమే అన తేలిపోయింది. త్రివిక్రమ్ లాగా ఆయన కొడుకు రిషి కూడా సినిమాల్లో డైరెక్టర్ కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే రవితేజ కొడుకు మహాధన్ సినిమాల్లోకి హీరోగా వస్తాడని చాలామంది ఊహించారు. కానీ అతను దర్శకత్వం వైపు మొగ్గుచూపడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. రవితేజ లాగే ఆయన కుమారుడు ఫండమెంటల్స్ నేర్చుకుని ముందుకు రావాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
Read Also : Spirit : ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదేనా !