Kodi Ramakrishna: ఘనంగా శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ 75వ జయంతి వేడుకలు
- టాలీవుడ్ చరిత్రలో గొప్ప దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు
- దాదాపు 120 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు
- శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ జయంతి జూలై 23
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ చరిత్రలో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శతాధిక దర్శకుడిగా పేరు తెచ్చుకుని గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు.
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో కోడి రామకృష్ణ దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆ చిత్రం అప్పట్లో 560 రోజులకు పైగా ప్రదర్శింపబడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ చిత్రాలు, పొలిటికల్ సెటైర్స్, ఫిక్షన్, ఫాంటసీ, థ్రిల్లర్ ఇలా జోనర్ ఏదైనా సరే! టాలీవుడ్‌లో మరే దర్శకుడికీ లేనన్ని సిల్వర్, గోల్డెన్ జూబ్లీ మూవీస్ చేసిన ఘనత ఆయనకే సొంతం.
Also Read
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
ఎ.ఎన్.ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ వంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్‌ను తెరకెక్కించటమే కాకుండా దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు. హీరోయిజాన్నే కాదు, అకుంశం వంటి చిత్రంలో రామిరెడ్డి, భారత్ బంద్ చిత్రంలో కాస్ట్యూమ్ కృష్ణ వంటి నటీనటులతో సరికొత్త విలనిజాన్ని తెలుగు సినీ తెరకు పరిచయం చేసిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఇప్పుడు వి.ఎఫ్.ఎక్స్ సినిమాలు చేయటం సాధారణంగా మారాయి. కానీ ఆ రోజుల్లో దేవి, దేవీపుత్రుడు, అంజి, అమ్మోరు, అరుంధతి వంటి సినిమాలతో ఔరా అని ఆశ్చర్యపోయేలా గ్రాఫిక్స్‌ను క్రియేట్ చేశారు.
దర్శకుడిగానే కాదు, నటుడిగానూ కొన్ని కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పుని పొందారు. దాదాపు 120 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ జయంతి జూలై 23. ఈ సందర్భంగా ఆయనకు మురళీ మోహన్, బాబూ మోహన్, శివాజీ రాజా, పృథ్వీ, హీరో శ్రీకాంత్, జొన్నవిత్తుల, రేలంగి నరసింహారావు, దేవీ ప్రసాద్, డైరెక్టర్ రాంబాబు సహా పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించి కోడి రామకృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు.
Also Read: Ashwinidath: మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం అశ్వనీదత్ సినిమా.!
తాజావార్తలు
-
Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
-
Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
-
Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
-
CM Revanth Reddy : చెరువులకు మళ్లీ జీవం.. HYDRAAపై సీఎం ప్రశంసలు.!
-
NEET-UG 2026: నీట్- యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. ఆగస్టు 4 నుంచే..
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!