టాలీవుడ్ చరిత్రలో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శతాధిక దర్శకుడిగా పేరు తెచ్చుకుని గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో…