Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు ‘భారతీరాజా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యానికి మారుపేరుగా నిలిచారు ప్రముఖ దర్శకుడు భారతీరాజా. ఒకప్పుడు భారతీరాజా సినిమా వస్తోందంటే చాలు వైవిధ్యానికి జై కొట్టేవారందరూ థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. వారి అభిరుచికి తగ్గట్టుగానే భారతీరాజా సినిమాలు రూపొందేవి. దర్శకునిగానే కాదు, నటునిగానూ కొన్ని చిత్రాలలో అలరించారు భారతీరాజా. తమిళ దిగ్గజ
దర్శ కుల్లో ఒకరిగా నిలిచినా భారతీ రాజా (85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ భారతీ రాజా మృతి చెందారు. 1941 జులై 17న జన్మించిన భారతీ రాజా. పదహారేళ్ల వయసు, సీతాకోక చిలుక, ఆరాధన సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు.
వ్యక్తిగత జీవితం :
భారతీరాజా 1974లో చంద్రలీలను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కొడుకు మనోజ్ ‘తాజ్ మహల్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నటి నందనను వివాహం చేసుకోగా కొడుకు 2025 మార్చి 25న గుండెపోటుతో మనోజ్ మరణించారు. కూతురు జనని మలేషియాకు చెందిన రాజ్‌కుమార్ తంబిరాజాను వివాహం చేసుకున్నారు.
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
సినిమా ప్రయాణం : భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. ఆయన 1941 జూలై 17న తమిళనాడులోని తేని అల్లినగరంలో జన్మించారు. బాల్యం నుంచీ భారతీరాజా కళల పట్ల ఆకర్షితుడై సినిమా రంగంలో తన ఉనికిని చాటుకోవాలని తపించేవారు. దాంతో మదరాసుకు చేరి చిత్రసీమలో చేరేందుకు పలు పాట్లు పడ్డారు. అప్పట్లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమా రంగాలన్నిటికీ కేంద్రం మదరాసు. దాంతో తొలుత కన్నడ దర్శకుడు పుట్టన్న కణగల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. తరువాత తెలుగు దర్శకులు పి.పుల్లయ్య వద్ద కొన్ని చిత్రాలకు పనిచేశారు. మళయాళ దర్శకుడు ఎమ్.కృష్ణన్ నాయర్ దగ్గర, తమిళ దర్శకుడు ఎ.జగన్నాథన్ చిత్రాలకూ అసోసియేట్ గా, కో-డైరెక్టర్ గా ఉన్నారు భారతీరాజా. నాలుగు భాషల దర్శకుల వద్ద పనిచేయడంతో భారతీరాజాకు దర్శకత్వంపై మంచి పట్టు లభించింది. తన ఊరికి సమీపంలోని వారే అయిన ఇళయరాజా, వారి సోదరులను కూడా చిత్రసీమలో అడుగు పెట్టేలా చేయడానికి భారతీరాజా ఎంతగానో సహకరించారు. ఇక భారతీరాజా తాను తీసే చిత్రం రెగ్యులర్ మూవీస్ కు భిన్నంగా ఉండాలని ఎప్పుడూ తపించేవారు. ఆ తపనతోనే 1977లో విడుదలైన “16 వయతినిలే” చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి సంచలనం సృష్టించారు. ఆ చిత్రం సాధించిన ఘనవిజయంతో భారతీరాజా వైవిధ్యం కోసం సినీజనం పరుగులు తీశారు. భారతీరాజా రెండో చిత్రం ‘కిళక్కే పోగుం రైల్’ ఈ చిత్రం ద్వారా రాధికను నాయికగా పరిచయం చేశారు. ఇందులో మన తెలుగు నటుడు సుధాకర్ (తరువాత తెలుగులో ఫేమస్ కమెడియన్ గా మారారు) హీరోగా నటించారు. ఈ సినిమా మరింత విజయం సాధించింది. సుధాకర్ కు తమిళనాట స్టార్ హీరోగా మారడానికి కారణమయింది. మూడో చిత్రం ‘సిగప్పు రోజాక్కల్’. ఇది సంచలన విజయం సాధించింది. కమల్, శ్రీదేవి నటించిన ఈ చిత్రం తెలుగులో ‘ఎర్ర గులాబీలు’గా అనువాదమై, ఇక్కడా విజయం సాధించింది. నాల్గవ చిత్రంగా ’16 వయదినిలే’ను హిందీలో ‘సోల్వా సావన్’గా తెరకెక్కించారు భారతీరాజా. ఈ సినిమాతోనే శ్రీదేవి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. ‘సోల్వా సావన్’ అంతగా అలరించలేకపోయింది.
భారతీరాజా తెరకెక్కించిన ‘పుదియ వార్పుగల్’లో శిష్యుడు భాగ్యరాజ్ హీరోగా నటించగా, రతి అగ్నిహోత్రి నాయిక. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదే కథను భారతీరాజా తెలుగులో ‘కొత్త జీవితాలు’ పేరుతో రీమేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా సుహాసిని తెలుగు చిత్రసీమకు పరిచయమయింది. ‘అలైగల్ ఒయివదిల్లై’ చిత్రం ద్వారా రాధను నాయికగా పరిచయం చేశారు.ఇదే చిత్రం తెలుగులో భారతీరాజా దర్శకత్వంలోనే ‘సీతాకోకచిలుక’గా రూపొందింది. ఈ సినిమా ద్వారా ముచ్చెర్ల అరుణ నాయికగా పరిచయమయింది. తెలుగులో కార్తిక్ కు ఇదే తొలి చిత్రం. ఇక భారతీరాజా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’ కూడా అప్పటి యువతరాన్ని ఆకట్టుకుంది. తెలుగులో “యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు” వంటి చిత్రాలు రూపొందించారు. అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కృష్ణతో ‘జమదగ్ని’, చిరంజీవితో ‘ఆరాధన’ రూపొందించారు భారతీరాజా. ఇవి కూడా ఆట్టే అలరించలేకపోయాయి. ఆ తరువాత ఆయన మళ్ళీ తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించలేదు.భారతీరాజా ‘కిళక్కే పోగుం రైల్’ను తెలుగులో బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్ళే రైలు’గా రూపొందించారు. భారతీరాజా ‘మన్ వాసనై’ చిత్రం తెలుగులో బాలకృష్ణ హీరోగా ‘మంగమ్మగారి మనవడు’గా రూపొందింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే!
చివరి సినిమా : 2013లో ఆయన తెరకెక్కించిన ‘అన్నకోడి’ అంతగా అలరించలేకపోయింది. దాంతో దాదాపు ఏడేళ్ళు మెగాఫోన్ పట్టలేదు భారతీరాజా. 2020లో ఆయన రూపొందించిన ‘మీండుమ్ ఒరు మరియాదై’ కూడా ఆకట్టుకోలేదు. ఇందులో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు.
నటుడిగా రాజా : అంతకు ముందు కొన్ని చిత్రాలలో అతిథిగా కనిపించిన భారతీరాజా, మణిరత్నం తెరకెక్కించిన ‘యువ’ సినిమా ద్వారా నటునిగా మారారు. తరువాత పలు చిత్రాలలో నటించారు. శింబు హీరోగా వచ్చిన ఈశ్వరన్ లో కీలక పాత్ర పోషించి మెప్పించారు. 2022లో వచ్చిన ధనుష్ తీరు సినిమాలో ముఖ్య పాత్ర పోషించి ఆ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.
అవార్డ్స్ : ఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, పలు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నా రాజాను భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించిన భారతీరాజా భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!