అమెరికాలో మ్యూజిక్ బ్యాండ్స్ చాలా పాపులర్.. వారి పాటలకు శ్రోతలు చెవులు కోసుకొంటారు. అయితే ఆ షోలలో సింగర్స్ చేసే అతి పనులు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. తాజాగా స్టేజీపై ఒక సింగర్ చేసిన నీచమైన పని ప్రస్తుతం అమెరికా అంతటా సంచలనంగా మారింది. అమెరికాలోని పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ బ్రాస్ అగెయిన్స్ట్ వివాదంలో చిక్కుకొంది. ఆ బ్యాండ్ లోని లీడ్ సింగర్ సోఫియా యురిస్ట్ ఒక నీచమైన పని చేసింది. సాంగ్ పాడుతుండగా ఒక అభిమానిని స్టేజీపై పిలిచి, అతడిని అడ్డంగా పడుకోబెట్టి అతడి ముఖంపై మూత్ర విసర్జన చేసింది. అందరి ముందు ప్యాంట్ విప్పి ఆమె అలా చేయడంతో వచ్చిన వారందరు ఖంగుతిన్నారు.
ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఆమెపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సిగ్గులేని పని చేసిందంటూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. దీంతో అభిమానులకు బ్రాస్ అగెయిన్స్ట్ క్షమాపణలు కోరారు. ఇక తాజాగా సింగర్ సోఫియా సైతం అభిమానులకు సారీ చెప్పింది. తాను చేసింది పొరపాటేనని, కొత్తగా ట్రై చేయాలనుకున్నాను కానీ అది ఫెయిల్ అయ్యిందని చెప్పుకొచ్చింది. కొందరు ఆ పని వల్ల బాధపడి ఉంటారనీ, ఇబ్బందిపడి ఉంటారనీ చెప్పుకొచ్చిన సింగర్ అందరు తనను క్షమించాలని కోరింది.