సోనూసూద్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దేశవ్యాప్తంగా సోను సూద్ కి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో అందరికి తెలిసిందే.రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూ రియల్ లైఫ్ లో కూడా హీరో గా అనిపించుకున్నాడు. ఎంతోమంది ఆయన్ని దేవుడిగా భావిస్తారు.మహమ్మారి కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో లక్షలాది మందికి అండగా నిలిచాడు సోనుసూద్. నోరు తెరిచి ఎవరు సహాయం కావాలి అన్న కూడా లేదనకుండా తనకు తోచిన విధంగా ఎంతోకొంత సహాయం చేసి రియల్ లైఫ్ లో హీరో గా మారాడు.
సోనూసూద్ ని అభిమానులు కలియుగ కర్ణుడు గా పిలుచు కుంటారు అంతేకాకుండా సోనూసూద్ విగ్రహానికి పూజలు కూడా నిర్వహిస్తారు.. సోను సూద్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగుతో పాటు హిందీ తమిళ భాషల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తూ పలు రకాల బ్రాండ్లకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోను సూద్ ట్విట్టర్ ఖాతాలో ఆస్క్ సోనూసూద్ పేరుతో ఫాన్స్ తో కొద్దిసేపు చాట్ సెషన్ ను ఆయన నిర్వహించారు. అందులో భాగంగా ఇళయ దళపతి విజయ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ల గురించి ఒక్క మాటలో చెప్పండి అని ఒక అభిమాని అడగగా ఆ ఇద్దరితో నేను నటించాను ఇద్దరూ కూడా అద్భుతమైన నటులు అంటూ లవ్ ఎమోజిలను పోస్ట్ చేసారు సోను సూద్. దానితో అటు మహేష్ అలాగే విజయ్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్ ని మరింత వైరల్ గా చేస్తున్నారు. ఇకపోతే సోనూ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త రకాల బ్రాండ్ యాడ్స్ లో కూడా నటిస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.