Sonia Singh: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు హీరోలు అవుతారు.. ఎవరు ఎప్పుడు జీరోలుగా మారతారు అనేది ఎవ్వరం చెప్పలేం. ఇప్పుడున్న స్టార్లు అందరు.. ఈ రేంజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఓవర్ నైట్ లో వచ్చిన సక్సెస్ అయితే కాదు అనే చెప్పాలి. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా వారి జీవితాన్ని మార్చేస్తుంది. అంతకుముందు వారు ఎలా ఉన్నారు అనేది అస్సలు గుర్తురాకుండా చేస్తోంది. ప్రస్తుతం నటి సోనియా సింగ్ జీవితాన్ని మార్చేసింది విరూపాక్ష సినిమా. యూట్యూబ్ ఛానెల్ లో షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సోనియా సింగ్. చాయ్ బిస్కెట్, గర్ల్స్ ఫార్ములా లాంటి యూట్యూబ్ ఛానెల్స్ లో కామెడీ వీడియోస్ తో పేరు తెచ్చుకొని రౌడీ బేబీ, హే పిల్ల వంటి యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించి సొంతంగా వీడియోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అలా హైలైట్ అయిన సోనియాకు సీరియల్స్ లో ఛాన్స్ వచ్చింది.
AjithKumar: ప్రియ’సఖి’ బిగి కౌగిలిలో నలిగిపోయిన అజిత్.. దిష్టి తగేలేనేమో
యమలీల సీరియల్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన సహనటుడు, బాయ్ ఫ్రెండ్ సిద్దుతో రీల్స్, ఇంటర్వ్యూలు, షోలలో పాల్గొని సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.ఆ సమయంలోనే విరూపాక్ష సినిమా రిలీజ్ అయ్యింది. అందులో అమ్మడి నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో సోనియా భయపెట్టిన తీరు అయితే అద్భుతమని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాతో సోనియా దశ తిరిగిందని చెప్పుకోవచ్చు. విరూపాక్ష లాంటి సినిమాతో భారీ విజయం అందుకోవడంతో సోనియాకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయట. స్టార్ హీరోల సినిమాల్లో అమ్మడు మంచి పాత్రలే పట్టేస్తుందని టాక్. మరి ముందు ముందు ఈ చిన్నది ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.