7/జి బృందావన కాలనీ చిత్రంతో తెలుగు నాట అనితగా గుర్తుండిపోయింది హీరోయిన్ సోనియా అగర్వాల్. ఈ సినిమా తర్వాత అమ్మడికి అవకాశాలు అంతగా లభించకపోయినా అనితగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచే ఉంటుంది. ఇక కొన్నేళ్ల క్రితం ధనుష్ అన్న సెల్వ రాఘవన్ ని వివాహమాడిన ఈ బ్యూటీ విభేదాల వలన భర్త నుంచి విడిపోయి ఒంటారిగా ఉంటుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, అక్క పాత్రలకు ప్రిఫరెన్స్ ఇస్తున్న సోనియా కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది.
కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో అదరగొడుతోంది. తాజాగా పింక్ కలర్ బ్యాక్ లెస్ టాప్ లో అమ్మడు అందాల విందు చేసింది. అడ్డం ముందు నిలబడి బ్యాక్ ని చూపిస్తూ హాట్ లుక్ తో చంపేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వయస్సులో కూడా అమ్మడి అందానికి కుర్ర హీరోయిన్లు కూడా సరిపోరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు . ప్రస్తుతం సోనియా కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తుంది.