‘డిటెక్టివ్ సత్యభామ’గా సోనియా అగర్వాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘నీ ప్రేమకై’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన సోనియా అగర్వాల్ ‘7/జి బృందావన్ కాలనీ’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు సెల్వరాఘవన్ తో పెళ్ళి, ఆ పైన విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది సోనియా అగర్వాల్. ఆమె నటించిన తాజా చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. ఈ సినిమాతో సంగీత దర్శకుడు నవనీత్ చారి తొలిసారి దర్శకుడిగా మారారు. శ్రీ శైలం పోలెమోని నిర్మించిన ఈ మూవీ ట్రైలర్, పోసర్ట్ ఆవిష్కరణ ఇటీవల ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ, ”మంచి టెక్నీషియన్స్ టీంతో పనిచేశాం. సోనియా అగర్వాల్ మా స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చేయటం చాలా సంతోషం. ఒక స్టార్ హీరోయిన్ ఈ కథను సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేయటాన్ని బట్టి ఈ కథలో ఉన్న విషయం అర్ధం చేసుకోవచ్చు. నిర్మాత ఎప్పుడూ టెన్షన్ పడలేదు. కొత్తవారైనా అనుభవం ఉన్న నిర్మాతలా ప్లాన్ చేసి షూటింగ్ సమయానికి అన్నీ అరేంజ్ చేశారు. ఇలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. ఈ చిత్రంలో సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్, భరత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..