ఇటీవల బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించింది. ఈ వార్తలు నిజం కాదని, తన పేరును ఉపయోగించుకుని పబ్లిసిటీ కోరుకునే వారు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె మండిపడింది. ఏ మేరకు సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక నోట్ ను పంచుకుంది. “నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలు, జర్నలిస్టులు, వార్తా విలేకరులను నేను అభ్యర్థిస్తున్నాను” అంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
Read Also : Sachin Joshi : ఎట్టకేలకు బెయిల్ పై విడుదలైన హీరో
“సదరు వ్యక్తి నా పేరును వాడుకుని పబ్లిసిటీ కోరుకుంటున్నాడు. నా ప్రతిష్టను దిగజార్చేందుకు నా నుంచి డబ్బులు వసూలు చేయాలనుకుంటున్నాడు. కష్టపడి నాకంటూ ఓ మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాను… కాబట్టి ఇలాంటివి నమ్మవద్దు. నా లీగల్ టీమ్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటుంది” అని తెలిపింది. దీని తరువాత సోనాక్షి ఇంట్లో కూర్చుని టీ తాగుతున్న తన ఫోటోను కూడా పంచుకుంది. ఫోటోను షేర్ చేస్తూ సోనాక్షి హౌస్ అరెస్ట్ అని రాసింది.