ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీస్ కు నెటిజన్లను ఫూల్ చేయడం కామన్ గా మారిపోయింది. షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్విట్టర్ లో ఒక వార్త ప్రకటించడం, అది కాస్తా వైరల్ గా మారాక అందంతా ప్రమోషనల్ స్టంట్ అన్నట్లు మరో ప్రకటన రిలీజ్ చేయడం అలవాటుగా మారింది. ఇటీవలే బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. కాఫీ విత్ కరణ్ ను ముగిస్తున్నట్లు ప్రకటించి ఆ తరువాత ప్రమోషనల్ స్టంట్ అని, కొత్త సీజన్ మళ్లీ మొదలుకాబోతుందని చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ అతడిపై ఫైర్ అయ్యారు. ఇక తాజాగా ఇదే స్టంట్ ని వాడింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. ఈ ముద్దగుమ్మ గత కొన్ని రోజుల క్రితం చేతికి డైమండ్ రింగు, పక్కన బాయ్ ఫ్రెండ్ ను పట్టుకొని కెమెరాకు ఫోజులిస్తూ రింగ్ ను హైలైట్ చేసి చూపించింది. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు.. నా పెద్ద కల నెరేవేరిన రోజు అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకురావడంతో ఇంకేముంది అమ్మడు సింగిల్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి పీటలు ఎక్కుతుందేమో అనుకున్నారు.. అయితే తాజాగా అదంతా ఏమి లేదు.. నా కొత్త నెయిల్ పాలిష్ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకుంటున్నాను అంటూ చెప్పి అభిమానులను ఫూల్స్ ని చేసి షాక్ ఇచ్చింది.
“ఓకే ఓకే .. నేను మిమ్మల్ని బాగా ఆటపట్టించానని అనుకుంటున్నాను. నేను మీకు చెప్పిన దాంట్లో ఏది అబద్దం లేదు. నా సొంత నెయిల్ పాలిష్ బ్రాండ్ సోయిజీ ని ప్రారంభించే రోజు నిజంగా నాకు గొప్ప రోజే. అద్భుతమైన నెయిల్స్ కోసం ప్రతి అమ్మాయికి ఇదే చివరి గమ్యం అవుతుంది. నేను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి నా బిగ్గెస్ట్ డ్రీమ్స్ ఒకదానిని నిజం చేసుకున్నాను. ఆ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. సోయిజీ వేసుకున్న పిక్స్‌తో చివరిగా నా కొత్త ప్రేమని మీతో పంచుకుంటున్నాను. మీరు ఏమనుకున్నారు??? హహహహ.. లవ్ యూ గాయ్స్! మీరు ఇచ్చిన సపోర్ట్ కు థాంక్స్”అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్ల కోపం నషాళానికి ఎక్కింది.. ఇలాంటి చీప్ ప్రమోషన్స్ స్టంట్స్ ఎందుకు.. బ్రాండ్ ను ప్రమోట్ చేయమంటే చేస్తాం కదా అని కొందరు.. పెళ్లి చేసుకుంటున్నావని హ్యాపీగా ఫీల్ అయ్యాం.. అరెరే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.