Sobhita Dhulipala: నేను ఏ తప్పు చేయలేదు.. చైతన్యతో ఎఫైర్ పై కుండబద్దలు కొట్టేసిన శోభిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sobhita Dhulipala Gives Clarity On Affair Rumours With Naga Chaitanya: సినీ తారలపై తరచూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా.. వారి వ్యక్తిగత విషయాలు, అందునా డేటింగ్‌కి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు, అవి బాగా వైరల్ అవుతాయి. ఇప్పుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళపై కూడా అలాంటిదే ఒక రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. కొంతకాలం నుంచి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని విస్త్రృతమైన ప్రచారం జరుగుతోంది. ఒకసారి లండన్ వెకేషన్‌లో, మరోసారి రెస్టారెంట్‌లో ఇద్దరూ జంటగా కనిపించడంతో.. ఈ డేటింగ్ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది. వీళ్లిద్దరి మధ్య పక్కాగా పప్పులు ఉడుకుతున్నాయని అందరూ దాదాపు ఫిక్స్ అయ్యారు. అయితే.. ఇది నిజమా? కాదా? అన్నది స్వయంగా ఆ సెలబ్రిటీల నోట వినాలని ప్రజలు తహతహలాడుతున్నారు. ఈ వ్యవహారంపై నాగచైతన్య ఇంతవరకూ స్పందించలేదు కానీ, తాజాగా శోభితా మాత్రం షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.
Ranbir Kapoor: బాలీవుడ్‌పై రణ్‌బీర్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. ఏకిపారేశాడుగా!
Also Read
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
- Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
- KING : షారూఖ్ ఖాన్ కింగ్‌ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
ఈ లవ్ రూమర్‌కి సంబంధించి తనకు ప్రశ్న ఎదురవ్వగా.. శోభితా ధూళిపాళ ఇలా స్పందించింది. ‘‘ఇప్పుడు నేను మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. రీసెంట్‌గా మణిరత్నం డైరెక్షన్‌లో పొన్నియన్ సెల్వన్ వంటి చారిత్రాత్మక సినిమా చేశాను. ఆ సినిమాలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలకు నేను డ్యాన్స్ చేశాను. అది నాకు అత్యద్భుతమైన అనుభవం. ఇంత మంచి మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు.. ఎవరో ఏదో అంటున్నారని, దాని గురించి ఆలోచిస్తూ ఫీలైపోవాల్సిన అవసరం లేదు. అసలు నాకు ఆ రూమర్‌తో సంబంధమే లేనప్పుడు, నేను ఏ తప్పూ చేయనప్పుడు.. అర్జెంట్‌గా దాని మీద క్లారిటీ ఇవ్వాలని ఎందుకు అనిపిస్తుంది? నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి, కంగారు పడాల్సిన అవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను’’ అంటూ సమాధానం ఇచ్చింది. అంటే.. తనకు, నాగచైతన్యకు మధ్య ఎలాంటి ఎఫైర్ నడవట్లేదని అమ్మడు పరోక్షంగా క్లారిటీ ఇచ్చిందన్నమాట! మరి.. లండన్‌లో ఇద్దరు కలిసి కెమెరాకి చిక్కిన ఫోటోల కథేంటి?
Personal Income Tax: గరిష్టంగా ట్యాక్స్ వసూలు చేసే టాప్-10 దేశాలు
తాజావార్తలు
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
-
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్‌పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
-
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!