కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నటి స్మృతి ఇరానీ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న హిట్ ధారావాహిక ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ తో బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్ కోసం ఆమె ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు ఇటీవల తెగ చెలరేగాయి. అయితే ఇప్పటికే ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరగడం తో, స్మృతి ఇరానీ ఈ రెమ్యునరేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
Also Read: Bullettu Bandi : ‘బుల్లెట్టు బండి’ టీజర్ రిలీజ్..అదరగొట్టిన లారెన్స్ అన్నాదమ్ములు
స్మృతి మాట్లాడుతూ.. “నేనే బుల్లితెరలో అందరికంటే ఎక్కువ పారితోషికం పొందుతున్న నటిని. గతంలో ఈ సీరియల్ ప్రేక్షకాదరణతో పాటు రేటింగ్ పరంగానూ టాప్ స్థాయిలో ఉండేది. అలాంటప్పుడు నటీనటులకు కావలసిన మేర పారితోషికం అందించడం సహజం. మేము కాంట్రాక్టర్లతో మాట్లాడుకోని ఒప్పందాలు చేసుకుంటాం. నేను యూనియన్ సభ్యురాలిని కాబట్టి, నాకు కూడా ఒక నంబర్ ఉంటుంది. దాని ఆధారంగా పారితోషికం తీసుకుంటాను. నేను ఇతర నటీనటులను ఓడించానని చెప్పవచ్చు. అందుకే నన్ను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతారు. ఇది కేవలం నటన మాత్రమే కాదు, ఓ బాధ్యత కూడా’ అని తెలిపింది. కానీ ఎంత తీసుకుంటుందో నెంబర్ మాత్రం చెప్పలేదు.
దాదాపు 25 సంవత్సరాల క్రితం ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ ధారావాహికలో తులసి పాత్ర ద్వారా స్మృతి ఇరానీ పాపులారిటీని అందుకున్నారు. 2000 జూలైలో ప్రారంభమైన ఈ సీరియల్ 2008 నవంబరు వరకూ విజయవంతంగా ప్రసారం అయింది. ఆ సమయంలో స్మృతి ఇరానీ తులసి పాత్రకు పలు అవార్డులు, విశేషాలాభాలు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు అదే సీరియల్‌కు రెండో భాగంగా ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ జియో సినిమా, స్టార్‌ప్లస్ ఛానెల్‌లలో ప్రసారం అవుతోంది. ఇక ఈ భారీ పారితోషికంతో స్మృతి ఇరానీ బుల్లితెరపై తన కీ రీ ఎంట్రీని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ సీరియల్‌కు ఎంతో ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నారు.