ట్యాలెంట్ పవర్‌హౌస్‌గా పేరుగాంచిన రాఘవ లారెన్స్, ఆయన తమ్ముడు ఎల్విన్ కలిసి లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘బుల్లెట్టు బండి’. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ చిత్రం డైరీ ఫేం దర్శకుడు ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహించారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కతిరేసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో, తెలుగు అమ్మాయి వైశాలి రాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా సినిమా మేకర్స్ శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే మొదటి షాట్ నుంచే కథలోకి లాగేసే రీతిలో కట్ చేయబడింది. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండగా, శ్యామ్ సిఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ మొత్తానికి ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
Also Read : Anushka : ‘ఘాటి’లో అనుష్క బరువు తగ్గడంపై మళ్లీ విమర్శలు..
గతేడాది ‘జిగర్తాండా డబుల్ ఎక్స్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన లారెన్స్, ఈ చిత్రంతో కూడా హిట్ కొట్టడం ఖాయమనే హైప్ క్రియేట్ అయ్యింది. మరో విశేషం ఏమిటంటే, రియల్ స్టార్, స్వర్గీయ శ్రీహరి భార్య డిస్కో శాంతి ఈ మూవీతో చాలాకాలం తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు, అయితే అతని డబ్బింగ్ కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. మొత్తానికి మంచి బజ్ క్రియేట్ చేసింది.