MAD: ‘మ్యాడ్’గాళ్లు సైలెంటుగా వచ్చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sithara Entertainments MAD to release on 28th September: ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ మూవీ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. రక్షా బంధన్ రోజున సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా ప్రకటించి టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు యూట్యూబ్‌లో అది ట్రెండింగ్ లో ఉంది. ఇక వినోదభరితంగా సాగిన టీజర్ కి వస్తున్న అద్భుతమైన స్పందనతో మ్యాడ్ సినిమా విడుదల తేదీని ప్రకటించాలని సినిమా యూనిట్ నిర్ణయించుకుని మ్యాడ్ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Bigg Boss Telugu 7: లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చిన నటి.. ఏకంగా హీరోయిన్ ను దింపుతున్న బిగ్ బాస్ టీమ్
Also Read
ఈ సినిమాలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక్క టీజర్ తోనే యువత దృష్టిని ఆకర్షించి, థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలనే ఆసక్తి కలిగేలా చేసిన మ్యాడ్ సినిమా మీద మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి సినిమాటోగ్రఫర్ లుగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఇక ఈ సినిమాలో రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!