Bigg Boss Telugu 7: లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చిన నటి.. ఏకంగా హీరోయిన్ ను దింపుతున్న బిగ్ బాస్ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Pisse to enter Bigg Boss Telugu 7 House: బిగ్ బాస్ తెలుగు 7 ఇంకా రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. నాగ్ హోస్ట్ చేయబోతున్న ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇద్దరు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లు చివరి నిమిషంలో డ్రాప్ కావడంతో వారికి రీప్లేస్ మెంట్స్ వెతుకుతున్నారు. ఇక అందులో భాగంగా ఒక సీరియల్ హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు కన్నడ భామ ఐశ్వర్య పిస్సే. అగ్నిసాక్షి సీరియల్ తో గౌరిగా తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన ఐశ్వర్య ముందు తెలుగు రాకపోవడంతో ఆరంభంలో ఇంగ్లీష్ లో డైలాగ్స్ రాసుకుని చెప్పేదట. అయితే ఇప్పుడు బాగా అలవాటు కాకపోవడంతో తెలుగులో చక్కగా మాట్లాడేస్తోంది.
Also Read
ఇక ఇప్పుడు ఆమె కస్తూరి సీరియల్ లో లీడ్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బుల్లితెర నటి నవ్యస్వామి అన్నయ్యను ఐశ్వర్య వివాహం చేసుకుంది. కన్నడలో ముందుగా రెండు సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసిన ఐశ్వర్య ఆ తర్వాత మెయిన్ లీడ్ గా కూడా ఒక సీరియల్ లో చేసింది. ఓ వైపు నటన కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తి చేసిన ఆమె రెండు కన్నడ సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేసింది. కానీ సీరియల్స్ లో వరుస అవకాశాలు రావడంతో సినిమా ఛాన్సులు పక్కన పెట్టేసి పూర్తిగా సీరియల్స్ మీదనే ఫోకస్ చేస్తోంది. ఇక ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె హౌస్ లో ఎలా ఉండనుంది? ఎన్ని రోజులు నెట్టుకు రాబోతుంది అనే విషయాల మీద చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
ట్రెండింగ్
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!