Sita Ramam Trailer: సీత కోసం వెతుకుతున్న రష్మిక.. ఇంతకీ రామ్ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sita Ramam Trailer: మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే ‘సీతారామం’. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ వంటి సినిమాలను తెరకెక్కించిన హనురాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించింది. మద్రాస్ రెజిమెంటల్‌లో లెఫ్టినెంట్‌గా పనిచేసే రామ్ రాసిన లేఖ ఆధారంగా సీత కోసం రష్మిక వెతుకుతున్న సన్నివేశాలు ట్రైలర్‌లో చూపించారు. సీత కోసం రామ్… రామ్ కోసం సీత పరితపించే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Read Also: OTT Release: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త రూల్!
Also Read
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ నేపథ్యాలతో పాటు వైవిధ్యమైన పాత్రలను ఈ ట్రైలర్‌లో చూపించారు. బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటించాడు. మురళీశర్మ, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది. ఈ మూవీని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్, స్వప్నదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!