OTT Release: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త రూల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Film Chamber of Commerce new rule! థియేటర్లలో విడుదలయ్యే తెలుగు సినిమాలను ఓటీటీలో ఎన్ని వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనే విషయంలో గత కొంతకాలంగా నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటి వరకూ సినిమా విడుదలైన తర్వాత నాలుగో వారంలో ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలైతే నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటే బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైన సినిమాలు కొన్ని నాలుగు వారాల కంటే ముందే ఓటీటీలో వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇటీవల కొందరు నిర్మాతలు సినిమాలు థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాత అంటే సుమారుగా ఏడు వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్యే మార్గంగా దీనికో పరిష్కారం తీసుకు రాబోతోంది. ఆరు కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో తీసిన సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ప్రదర్శించుకోవచ్చని, అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలను మాత్రం పది వారాల తర్వాతే ఓటీటీలో ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వాలని సూచన చేయబోతోంది. ఇదిలా ఉంటే… మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో సినిమాలను ప్రదర్శించాలని కోరుతున్నాయి.
ఇక తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో ఉన్న అనిశ్చిత స్థితిని పొగొట్టే ప్రయత్నం చేసింది. చిన్న సినిమాలను ఎ, బి సెంటర్స్ లో రూ. 100, 125 రూపాయలకు, సి సెంటర్స్ లో రూ. 70, 125 రూపాయలకు ప్రదర్శించాలని పేర్కొంది. అలానే మీడియా బడ్జెట్ మూవీస్ ను ఎ, బి సెంటర్స్ లో రూ. 112, 177కు, సి సెంటర్స్ లో రూ. 100, 177కు ప్రదర్శించాలని తేల్చింది. ఇక బిగ్ బడ్జెట్ మూవీస్ ను అయితే ఎ, బి సెంటర్స్ లో రూ. 177, 295, సి సెంటర్స్ లో రూ. 150, 295కు ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపింది. వీరి దృష్టిలో ‘ట్రిపుల్ ఆర్’ వంటి సినిమాలు భారీ బడ్జెట్ కేటగిరిలోకి వస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా వచ్చే మీడియం బడ్జెట్ మూవీస్ ను అత్యధికంగా రూ. 177కు జనం చూడొచ్చు. ఇదిలా ఉంటే… మల్టీప్లెక్స్ థియేటర్ల రేట్స్ విషయంలో మాత్రం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకోలేదు. ఈ రేట్లపై ప్రేక్షకులు, సినీజనం ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!