Sir: ధనుష్ ‘సార్’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మాస్టారు… మాస్టారు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sir: ధనుష్ హీరోగా శ్రీకర స్టూడియోస్ సమర్పణ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ట్యూన్ సినిమాస్ కలసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘సర్’ సినిమా నుంచి తొలి లిరికల్ వీడియో విడుదల అయింది. జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటను శ్వేతా మోహన్ పాడారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ ఫస్ట్ సింగిల్ మెలోడీగా సాగుతూ అందరినీ ఆకట్టుకునేలా సాగింది. హీరోయిన్ సంయుక్త మీనన్ భావంలో సాగే మెలోడి ఇది.
‘సీతాకాలం మనసు నీ మనసున చోటు అడిగింది. సీతకు మల్లే నీతో అడుగేసే మాట అడిగింది’… ఇకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే.. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నే కలగన్నట్లే నా పక్కన నిలిచారు.. ఇలాంటి పంక్తులతో అటు యువతను ఇటు పిన్నా, పెద్దలను అలరించే సాహిత్యంతో సాగిన ఈ పాట సూపర్ హిట్ పాటల్లో చోటు దక్కించుకోవడం ఖాయం అనేలా ఉంది. ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సాయికుమార్, భరణ, సుముతిరఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీనివాస్, పమ్మిసాయి, హైపర్ ఆది, షరా, ఆడుకాలమ్ నరేన్, ఇలవరసు, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ ఇతర పాత్రలను పోషించారు. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంలో పాటలను విడుదల చేస్తోంది. ఈ చిత్రానికి నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read
- Nagarjuna: "ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు".. 'లెనిన్' సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- Nag Chaitanya: 'ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో'.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
- Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
- NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!