Singer Mangli: బావతో ఏడడుగులు.. పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మంగ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singer Mangli: జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతి సాంగ్స్ పాడి ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ. బతుకమ్మ, శివుడు పాటలు పాడి.. సినిమా అవకాశాలు సైతం అందుకుంది. ప్రస్తుతం సినిమాలో ఏ మాస్ సాంగ్ అయినా కూడా మంగ్లీ వైపే చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. అంతలా పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఇంకోపక్క ఆల్బమ్స్ తో బిజీగా మారింది. ఇక గత కొన్నిరోజులుగా మంగ్లీ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె త్వరలోనే ఒక ఇంటి కోడలు కాబోతుందని, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుందని వార్తలు వచ్చాయి. మంగ్లీకి బావ వరుస అయ్యే వ్యక్తితో ఆమె పెళ్లి జరగబోతుందని చెప్పుకువచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం మంగ్లీ అన్ని పనులు పక్కనపెట్టి.. పెళ్లి పనులపైనే నిమగ్నమైందని కూడా వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలపై మంగ్లీ స్పందించింది. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనేది లేదని ఖరాకండీగా చెప్పుకొచ్చింది. అసలు నాకు తెలియకుండా నా పెళ్లి ఏంటి అని ఘొల్లున నవ్వింది.
Pooja Hegde: అయ్యో.. పూజా.. చూసుకోవాలి కదరా.. చూడు ఎంతపెద్ద దెబ్బ తగిలిందో..?
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఏంటి? నాకు పెళ్లా? ఓరి భగవంతుడా.. నాక్కూడా తెలియకుండానే నాకు పెళ్లి చేసేస్తున్నారా?. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. మా బావతో పెళ్లి అంటూ చెప్పుకొస్తున్నారు.. ఇంతకీ బావతో ఏడడుగులు వేస్తున్నానన్నారు. నాకు తెలియక అడుగుతున్నా.. నాకే తెలియని నా బావ ఎవరో చెప్తారా? ఈ పుకారు సృష్టించినవాళ్లైనా దీనికి సమాధానం చెప్పండయ్యా..” అంటూ సెటైర్లు వేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో మంగ్లీ పెళ్లి వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చేయడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!