చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. హీరోయిన్లనే కాదు చిత్ర పర్సరంలో పనిచేసే ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇండస్ట్రీలో తమను లేకుండా చేస్తామని బెదిరించడంతో , భయపెట్టడమో చేయడం వలన వారు మౌనంగా ఉంటున్నారు. అయితే ఈ మీటూ వలన వారందరు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అయితే తాజాగా హాలీవుడ్ సింగర్, ఒక నటుడిపై లైంగిక ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ సీనియర్ నటుడు క్రిస్ నాత్‌పై సింగర్ లీసా జెంటిల్ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె క్రిస్ నిజ స్వరూపం ఇది అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఘటన జరిగి చాలా ఏళ్ళు అయినా ఆరోజును తాను మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. ” క్రిస్ ని నేను మొదటి సరి 1998 లో మొదటిసారి కలిశాను. 2002 వరకు మా మధ్య స్నేహం ఉండేది. ఒక రోజు తను . నన్ను ఇంటివద్ద దింపుతాను అని వచ్చాడు.. నేను లోపలి వెళ్తుండగా వెనుకే వచ్చి తలుపు మూసి.. నన్ను పట్టుకొని ముద్దులు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వద్దు అని అంటున్నా బలవంతంగా పట్టుకొని వేధించాడు. ప్యాంట్ తీయడానికి ప్రయత్నించాడు. నేను నాకు ఇష్టం లేదని గట్టిగా కేకలు వేయడంతో నన్ను బూతులు తిట్టి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఎక్కడైనా చెప్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు. అప్పుడు నా కెరీర్ వలన ఈ విషయం బయటపెట్టలేదు. ఇటీవల అతనిపై మరో నలుగురు అమ్మాయిలు లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో నేను నోరు విప్పాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక సింగర్ ఆరోపణలను ఈ సీనియర్ హీరో కొట్టిపారేశాడు. ఆమె చెప్పవన్నీ అబద్దాలే అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ ని షేక్ చేస్తోంది.