SIIMA 2023 Best Actor in a Supporting Role in Telugu: భారతదేశంలో సినీ అవార్డులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు ముహూర్తం ఖరారు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ బృందా ప్రసాద్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ అవార్డులకు దుబాయ్ వేదిక కానుంది, సైమా వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘నెక్సా’ వ్యవహరించనుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా రానా, మరోక హోస్ట్‌గా మృణాల్ వ్యవహరించే అవకాశం ఉంది. సైమా అవార్డుల కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీ-నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభించి 11 ఏళ్లుగా సైమా అవార్డు పురస్కారాల వేడుకలు విజయవంతంగా జరుపుతున్నారు.
Bhola Shankar: భోళాశంకర్ సినిమా టికెట్ రేట్లు పెంచుతారా లేదా…?
ఇక ఈ ఏడాది సైమా అవార్డుల నామినేషన్స్ లో ఏకంగా 11 కేటగిరిలో 11 నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సృష్టించగా ఆర్ఆర్ఆర్ తర్వాత 10 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్న సినిమాగా సీతారామం నిలిచింది. ఈ రెండు కాకుండా బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో తెలుగు నుంచి dj టిల్లు, కార్తికేయ 2, మేజర్ చిత్రాలు నామినేషన్స్ లో నిలిచాయి. ఇక ఇప్పుడు తెలుగులో బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ కేటగిరీలో ఐదుగురు నటులు నిలిచారు. డీజే టిల్లు సినిమాకు మురళీధర్ గౌడ్, అంటే సుందరానికి సినిమాకి సీనియర్ నరేష్, భీమ్లా నాయక్ సినిమాకి రానా, ధమాకా సినిమాకి రావు రమేష్, సీతారామం సినిమాకి సుమంత్ లను సైమా నామినేట్ చేసింది . మరి వీరిలో బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా ఎవరు నిలుస్తారో చూడాలంటే ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సైమా అవార్డ్స్- 2023 ఈవెంట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.