Siddharth: సలార్ మీకు పెద్ద సినిమా కావచ్చు.. కానీ నాకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth: బొమ్మరిల్లు సినిమాతో పక్కింటి అబ్బాయి లా మారిపోయాడు సిద్దార్థ్. ఈ సినిమా తరువాత మంచి మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మధ్యలో కొన్నేళ్లు సిద్దూ గ్యాప్ ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ ఏడాది టక్కర్ సినిమాతో వచ్చిన సిద్దుకు నిరాశనే మిగిలింది. ఇక ఈసారి మరో కొత్త కథతో సిద్దార్థ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సిద్దార్థ్ హీరోగా అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చిన్నా. ఈ చిత్రంలో సిద్దార్థ్ సరసన మలయాళ నటి నిమిషా సజాయన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కూతురు కోసం ఒక తండ్రి చేసిన పోరాటం చిన్నా కథగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 న రిలీజ్ అవ్వాల్సి ఉండగా .. కొన్ని కారణాల వలన అక్టోబర్ 6 న రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన సిద్దార్థ్ వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు.
Siddharth: తెలుగులో వీడి సినిమా ఎవరు చూస్తారని అడిగారు… స్టేజ్ మీదే ఏడ్చేసిన సిద్దార్థ్!
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ గురించి సిద్దార్థ్ మాట్లాడుతూ.. ” ఈ సినిమాను తెలుగులో సెప్టెంబర్ 28 న రిలీజ్ చేయడానికి నేను 45 రోజుల క్రితమే అనుకున్నాను. అదే రోజు సలార్ అనే సినిమా ఉన్నా కూడా నేను దాంతో పాటు వస్తాను అని 49 రోజుల క్రితమే డేట్ పెట్టాను. ప్రభాస్ కు నేను పెద్ద ఫ్యాన్ ను.. సలార్ సినిమా చూసాకే నా సినిమా చూస్తా.. అలా రెండు సినిమాలు ఒకేరోజు వచ్చినా ప్రాబ్లమ్ ఏంటి అనుకోని నేను ఆ డేట్ పెట్టాను. సలార్ మీకు పెద్ద సినిమా.. బడ్జెట్ వైస్.. కానీ, చిన్నా నా లైఫ్.. నాకు పెద్ద సినిమానే కదా. నా పెద్ద సినిమాను ప్రభాస్ తో పాటు పెడతాం అనుకున్నాను. ఆ తరువాత అదే డేట్ కు మరో పది సినిమాలు వచ్చేసాయి. ఆ పదిమంది వచ్చాక.. పర్లేదులే సిద్దార్థ్ అంటే.. కొత్తవాడేం కాదు. అతనికి మార్కెట్,టాలెంట్.. దానిపై నమ్మకం, పెద్దవాళ్లతో రిలేషన్ షిప్ మొదటినుంచి ఉన్నాయి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!