siddhaanth vir surryavanshi: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఉదయం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తుండగా ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. అప్పు మరణవార్తను ఇంకా చాలామంది అబిమనులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పు మరణం తరువాత జిమ్ లో అధిక వర్క్ అవుట్స్ చేయవద్దని డాక్టర్లు సూచనలు ఇస్తూనే వస్తున్నారు. ఇక తాజాగా పునీత్ లానే ఒక నటుడు జిమ్ చేస్తూ మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది.
బాలీవుడ్ సీరియల్ నటుడు సిద్దాంత్ వీర్ సూర్యవంశీ మృతి చెందాడు. నేటి ఉదయం సిద్దాంత్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆటను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కసౌథీ జిందగీ కే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న సిద్దాంత్ పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లో కూడా సిద్దాంత్ కనిపించాడు. 46 ఏళ్ళ సిద్దాంత్ ఎప్పుడు ఫిట్ గా ఉండడం కోసమా జిమ్ లో నిత్యం కసరత్తులు చేస్తూనే ఉండేవాడు. ఇక అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిద్దాంత్ మరణంపై బావులవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.