నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పీరియాడిక్ యాక్షన్ అండ్ లవ్ డ్రామాగా రూపొందిన ‘శ్యామ్ సింగ రాయ్’కి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నాని ఇందులో ద్విపాత్రాభినయం చేయగా, సాయి పల్లవి, కృతి శెట్టి ఇందులో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ‘శ్యామ్ సింగ రాయ్’ డిజిటల్ రైట్స్ ను ఓ పాపులర్ ఓటిటి సంస్థ సంపాదించినట్టు తెలుస్తోంది.
జనవరి చివరి వారం నుండి ‘శ్యామ్ సింగ రాయ్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జనవరి 4వ వారం సినిమా డిజిటల్ గా ప్రసారం అవుతుందని ప్రచారం జరుగుతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ ఓటిటి విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ త్వరలో ప్రకటించనుంది. సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తుండగా, మరోవైపు ఏపీలో సినిమా టికెట్ రేట్ల ఇష్యూపై నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.