స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. త్వరలోనే కోలుకొని ప్రేక్షకులముందుకు వస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఈ భామ తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఆమెకు ఏమైంది అంటూ భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ ఇంపాక్ట్ అమ్మడిపై భారీగానే పడినట్లు కనిపిస్తోంది. చిక్కి శల్యమైపోయి కనిపించింది. నిజంచెప్పాలంటే టక్కున చూస్తే ఈమె శృతి హాసన్ అని గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది.
ముఖమంతా పీక్కుపోయి, కళ్లు లోపలికి పోయి, కళ్లకింద నల్లటి చారలు, పెదాలు ఉబ్బినట్లు ఉన్న ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఈ ఫోటో చూస్తుంటే శృతి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదని అర్ధమవుతుంది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని, మునుపటి రూపంలోకి రావాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం శృతి.. సలార్, బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలలో నటిస్తుంది.